కొండమల్లేపల్లి: మహిళ ఫోన్ నెంబర్ అడుగుతున్న వ్యక్తికి ఓ యువతి దేహశుద్ది చేసిన ఘటన శనివారం రాత్రి మండలకేంద్రంలో జరిగింది. ఎస్బిఐ ఎదురుగా ఉన్న వీధిలో ఉండే ఓ వ్యక్తి మహిళా ఫోన్ నెంబర్ అడుగుతుండడంతో అతని కుటుంబ సభ్యులకు పిర్యాదు చేశారు. శనివారం మళ్లీ అదే వీధికి వచ్చి ఫోన్ నెంబర్ అడుగుతుండగా యువతి దేహశుద్ది చేసి వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.