నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

82చూసినవారు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని డిండి ఎస్ఐ రాజు హెచ్చరించారు. శుక్రవారం డిండిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారి పేరెంట్స్ పై కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్