ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు సమర శిలా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున డిండి మండల కేంద్రంలో గ్రామ శాఖ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని, ప్రజలను అంటిపెట్టుకొని ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు.