మిర్యాలగూడ మండలంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు ఆన్లైన్ విదానం ద్వారా హోరాహోరీగా జరిగాయి. అయితే పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన షేక్ పర్వేజ్ ఖాన్ గురువారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరు బాలు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతీ యువజన కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.