మిర్యాలగూడలో భారీ వర్షం

68చూసినవారు
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారంరాత్రి భారీవర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి పట్టణంలోని సీతారాంపురం, ముత్తిరెడ్డి కుంట, రాంనగర్, రౌండ్ ఏరియాలో రోడ్లపై నీరునిల్వచేరి రాకపోకలకు అంతరాయము ఏర్పడింది. సమీపకాలనీవాసులు వర్షంలోనే రాకపోకలు సాగించారు. దామరచర్ల మండలకేంద్రంలో తాటిచెట్టు పై పిడుగుపడగా చెట్టుకాలిపోయింది. అవంతిపురగ్రామంలో పిడుగు పడింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షం రాకతో హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్