హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన హైడ్రా కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లేనని, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీటీడీపీ నాయకులు పోగుల సైదులు గౌడ్ అన్నారు. కానీ, అదే తరహాలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కూడా అన్యాక్రాంతమైన నాళాలు, పంట కాలువలు పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోడానికి మిడ్రా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.