స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మ బిక్షం 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం బంగారుగడ్డ గ్రామంలో సీపీఐ పార్టీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మండల పార్టీ కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్ తో కలిసి ధర్మ బిక్షం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.