మునుగోడు: హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

83చూసినవారు
నల్గొండ జిల్లా మునుగోడులో శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 300 మంది వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ వాడకపోవడం వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని వాహనదారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్