నాంపల్లి: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం

82చూసినవారు
నాంపల్లి: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు, తహసీల్దార్ దేవా సింగ్ తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 585 కేంద్రంలో పురుషులు 846 మంది, మహిళలు 441 మొత్తం 1287 మంది పట్టభద్రులు ఓటు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందికలగకుండా పోలింగ్ కేంద్రం వద్ద తగిన సౌకర్యం కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్