ఉప్పాడ బీచ్‌లో ముందుకు వచ్చిన సముద్రం

50చూసినవారు
ఉప్పాడ బీచ్‌లో ముందుకు వచ్చిన సముద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'రెమాల్' తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుంచి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలల ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇవాళ నీటిమట్టం పెరగడంతో ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చింది. దాంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అల్టర్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్