చండూరు మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు రమా శంకర్ ఇటీవల ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబానికి భరోసాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్, దశదిన కర్మ రోజు ఆ పార్టీ నాయకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల సహాయం అందించారు. రమా శంకర్ సేవలను గుర్తుచేస్తూ ఆయన మరణం బహుజన్ సమాజ్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.