మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో గురువారం జరిగిన గ్రామ ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై. శేఖర్ రెడ్డి అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భం గా గ్రామపంచాయతీ, అంగన్వాడి కేంద్రం లో పలుకు రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని, అంగన్వాడి సెంటర్, సెగ్రిగేషన్ షెడ్డు, స్మశాన వాటిక నిర్వహణను పరిశీలించారు.