పెద్దవుర మండలం నయనవానికుంట గ్రామంలో బీఅర్ఏస్ యువ నాయకులు వినయ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నిర్మాణానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త భూషి రెడ్డి పాండురంగారెడ్డి భూమి పూజ చేసారు.అనంతరం తమ గ్రామానికి మొదటి సారి వచ్చిన పాండు రంగారెడ్డి ని గ్రామ యువకులు శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో గ్రామ బీ అర్ ఏస్ నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, బోలిగోర్ల శివ , బైకని సైదులు పాల్గొన్నారు.