ఉట్లపల్లి గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం

1340చూసినవారు
ఉట్లపల్లి గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం
పెద్దవూర మండలం పరిధిలోని ఉట్లపల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం పెద్దవూర మెడికల్ ఆఫీసర్ డా. నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంధత్వ నివారణే లక్ష్యంగా కృషి చేస్తుందని అన్నారు. ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది హారిక, విజయలక్ష్మి, ఆశ వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్