నిడమనూరు: రంగశాయిరెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ

53చూసినవారు
నిడమనూరు: రంగశాయిరెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ
నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో గ్రామ వాస్తవ్యులు మండల మొదటి ఎంపీపీ, మాజీ పీఏసీ యస్ చైర్మన్, సీనియర్ నాయకులు యడవల్లి రంగశాయి రెడ్డి నిన్న అనారోగ్యంతో మరణించారు. బుధవారం వారి నివాసంలో ఆయన పార్ధీవ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులుర్పించారు నల్గొండజిల్లా శాసన మండలి సభ్యులు యం. సి కోటిరెడ్డి. రంగశాయిరెడ్డి మృతి బాధాకరమని, వారి లేని లోటు తుమ్మడం గ్రామానికి తీరని లోటన్నారు.

సంబంధిత పోస్ట్