

చిట్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా
అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ అన్నారు. ప్రజా పాలన గ్రామసభలలో భాగంగా గురువారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గ్రామసభలను నిర్వహిస్తున్నదని తెలిపారు.