చివరి భూములన్నింటికీ సాగునీటిని అందిస్తాం

65చూసినవారు
ఏఎంఆర్పి ద్వారా తిప్పర్తి మండలంలో ని ఆయకట్టు చివరి భూములన్నింటికీ సాగునీటిని అందిస్తామని రాష్ట్ర రోడ్లు , భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అందువలన ఆయకట్టు చివరి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం, మామిడాల పెద్ద చెరువును తనిఖీ చేశారు. అంతేగాక తిప్పర్తి మండలం మామిడాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎంఆర్పి ద్వారా అందిస్తున్న సాగునీటి సరఫరాను తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్