సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో ఆదివారం నిర్వహించిన మాల సింహగర్జన సభకు నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గ్రామం నుంచి మాల కులస్తులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా విచారకరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాల కులస్తులు, యువకులు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.