దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ 105 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నల్లగొండ లో ఏఐటియుసి జెండాను పల్లా దేవేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం లో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించినదని అన్నారు.