తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలోని ఎస్సీ కాలనీలో 40 కుటుంబాలకు ఇంటింటికి, నల్లగొండ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-అర్డినేటర్ గండమళ్ళ మనోహర్ నిత్యావసర వస్తువులు అందజేసారు. లాక్‌డౌన్ వల్ల నిత్యావసరాల కొరకు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తమవంతుగా తోచిన సహాయం చేసామని తెలిపారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరం పాటించాలి అని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పేరం పవన్, నామ మధు, నీరుడు మధు, శ్రవణ్, శరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.