జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలి

58చూసినవారు
జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలి
గ్రామాలలో ప్రజలకు రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ సంస్థల నిర్వహణపై చేయాల్సిన బాధ్యత జిల్లా స్థాయి మొదలుకొని, గ్రామ స్థాయి అధికారుల వరకు ఉందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రామాలలో శానిటేషన్ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారులు రెగ్యులర్ గా నిర్వహించే లా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్