హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై పలువురు కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఇలాంటి చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని, శాసనసభ్యునికి రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.