నల్లగొండ జిల్లా పానగల్లు పరిధిలో గల జిల్లా గ్రామీణ త్రాగు నీటి సరఫరా (మిషన్ భగీరథ) ఎస్ఈ కార్యాలయంలో నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్ఈ సురేష్ బాబు పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధులను స్మరిస్తూ వారి ఆశయ సాధనలో ముందుండాలన్నారు. అనంతరం నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈఈ, డిఈలు, ఎఈలు తదితరులు పాల్గొన్నారు.