నల్గొండ: బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ 42 శాతం ప్రకటించినందుకు జ్యోతిరావు పూలే విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు పున్న పవన్ కుమార్ మాట్లాడుతూ రిజర్వేషన్లు కేంద్రంచే ఆమోదింపజేసి ఏ కులానికి ఎంత అని లెక్కలు తీసి బీసీలకు సంపూర్ణ న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, ఇతరులు పాల్గొన్నారు.