నల్గొండలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆధ్వర్యంలో మానవ హక్కులపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న ఆగడాలు, హింసకు వ్యతిరేకంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు.