నల్గొండ జిల్లా ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చిలుకూరి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ రెడ్డి హాజరైయ్యారు. వారు మాట్లాడుతూ.. సభ్యులందరూ సమిష్టిగా ఉండి ఒకే రేటుకు పెరిగిన రేట్లకు అనుగుణంగా పని చేసి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, ఎండి ఖదీర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.