రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మత్తులు మరియు హ్యామ్ రోడ్ల ఎంపికపై ఎస్ఈలతో శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు, పార్ట్ హోల్ ఫీలింగ్ మెకానైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యం ఇవ్వండని తెలిపారు.