తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులలో క్రీడల పట్ల అవగాహన కల్పించి, క్రీడలను పెంపొందించేందుకు ఉద్దేశించి చేపట్టిన సీఎం కప్పు క్రీడలలో భాగంగా నిర్వహిస్తున్న టార్చ్ ర్యాలీ గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోగా, మంత్రి క్లాక్ టవర్ వద్ద టార్చ్ ర్యాలీ జ్యోతిని అందుకున్నారు.