ప్రజా పరిపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమం కింద ట్రాన్స్ జెండర్ క్లినిక్ లను , అంబులెన్స్లను వర్చువల్ విధానంలో ప్రారంభించగా, జిల్లా కలెక్టర్ తో పాటు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.