
రాంరెడ్డి దామోదర్ రెడ్డి హయాంలోనే సూర్యాపేట మార్కెట్ అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన సూర్యాపేట మార్కెట్ ఏర్పాటు చేసిన ఘనత సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డిదే అని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శనివారం నూతన వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.