తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా ఉదయం 11 గంటలకు జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం సమావేశం కానుంది. దగా పడ్డా కాంగ్రెస్ సీనియర్ ల్లారా కదలిరండి పేరుతో కార్యక్రమం చేపట్టారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. గత కొంతకాలంగా సామేల్, యోగానంద చారి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో జాజిరెడ్డిగూడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యోగానంద నిరసన కార్యక్రమం చేయించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.