నారాయణ పేట జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు, కూలీలు బిజీబిజీగా కనిపిస్తున్నారు. వర్షాలు తెరపి ఇవ్వడంతో పంటల్లో అంతరసేద్యం, కోతకు వచ్చిన పంట కోతలు, కలుపుతీత, తెగుళ్ల నివారణ మందుల పిచికారీ, ఇంకా వేయాల్సిన పంటల సాగు తదితర పనులు జోరందుకున్నాయి. ఈ సమయానికి ఖరీఫ్ పంటల్లో మూడొంతులు కోత దశకు, రబీ పైర్లు విత్తడం పూర్తవుతుంది. మొత్తంగా ప్రస్తుతం పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.