నర్వ మండల వ్యాప్తంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మండలంలో క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. నూతన వస్ర్తాలు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పాస్టర్లు కేక్‌లను కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏసుక్రీస్తు జననం, బైబిల్‌లోని సందేశాలను జనాలకు వినిపిస్తున్నారు.