సమాజంలో నెలకొన్న కుల వివక్షకు వ్యతిరేకంగా కులరహిత సమాజం కోసం మహాత్మ జ్యోతిరావు బాపూలే చేసిన కృషి మరువలేనిదని, ఆయన ఆశయాలు యువతకు ఆచరణీయమని బిజ్వార్ మహేష్ గౌడ్ అన్నారు. గురువారం ఉట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా టీవీవీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.