పాతర్ చేడ్: రక్త శిబిరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు
నర్వ మండల కేంద్రంలోని పాతర్ చేడ్ గ్రామంలో శుక్రవారం రక్త శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో కేకు కట్ చేసి అనంతరం నర్వ మండల అధ్యక్షుడు బిసం చెన్నై సాగర్ తో పాటుగా 30 మంది దాతలుగా ముందుకు వచ్చి రక్తాన్ని డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కురుమయ్యతో పాటు పాతర్ చేడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.