నాట్కో ఫార్మా లాభాల్లో 40% వృద్థి

55చూసినవారు
నాట్కో ఫార్మా లాభాల్లో 40% వృద్థి
ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నాట్కో ఫార్మా ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 40.1 శాతం వృద్ధితో రూ.386 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.275 కోట్ల లాభాలను ఆర్జించింది. హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా క్యూ4లో ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,068 కోట్లకు చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్