హమాస్ అంతమే లక్ష్యంగా గాజా నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దక్షిణ గాజాలోని రఫాలో ఆకస్మికంగా పర్యటించారు. త్వరలో
అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించనున్న నేపథ్యంలో నెతన్యాహు గాజా పర్యటన ఆసక్తిగా మారింది. మరోవైపు జెరూసలెంలో ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల మంత్రి ఇతమార్ బెన్డీర్ పర్యటించిన కొన్ని గంటలకే నెతన్యాహు రఫాలో ఆకస్మిక పర్యటన చేపట్టినట్లు ప్రకటించారు.