వివాదాలకు ఆస్కారం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్) త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తాము ప్రతిపాదించనున్న చట్టాన్ని ఇప్పటికే రెండు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నట్టు తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నూతన చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు.