IPL మ్యాచ్‌ల ప్రిడిక్షన్ పేరిట సోషల్ మీడియాలో పలాన జట్టు ఈ రోజు మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని ప్రచారం చేస్తూ, కొంతమంది పరోక్షంగా యువతను బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారంటూ TGRTC ఎండీ సజ్జనార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్‌కు బానిసలను చేస్తున్నారన్నారు. ఇలాంటి మాయగాళ్ల మాటలు విని మోసపోవద్దంటూ సూచించారు.