'నిండు గోదారి కదా ఈ ప్రేమ' సాంగ్ లిరిక్స్

79చూసినవారు
'నిండు గోదారి కదా ఈ ప్రేమ' సాంగ్ లిరిక్స్
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరకీ బంధువుగా ఈ ప్రేమ

ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమ మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ

ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ
ఆనకట్టలాంటి హద్దులంటూ లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది

నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ

పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్