ట్రాక్టర్ లో మృతదేహం తరలింపు

53చూసినవారు
ఉట్నూర్ మండలంలోని చందూరి గ్రామం రాజుల గూడకు చెందిన చహకటి చిత్రు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మృతి చెందారు. ఆదిలాబాద్ నుంచి చిత్రు మృతదేహాన్ని తీసుకు వస్తున్న సమయంలో వర్షం రావడంతో వాగు వచ్చింది. దీంతో చిత్రు మృతదేహాన్ని బంధువులు ట్రాక్టర్ సహాయంతో ఇంటికి చేర్చారు. వాగు పై వంతెన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్