యువత డ్రగ్స్ కు అలవాటు పడి విలువైన భవిష్యత్ ను కొల్పతున్నట్లు ఎస్ఐ శంకర్, డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఖానాపూర్ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ బృందం కడెం మండలం మీదుగా దస్తూరాబాద్ వరకు మారథన్ రన్ నిర్వహించారు. డ్రగ్స్ అలవాటు వల్ల కలిగే అనర్థాలకు వివరించారు. యువత మేలుకో మద్యం మానుకో పేరుతో 28 కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించిన డాక్టర్ కిరణ్ కుమార్ బృందాన్ని ఎస్ఐ అభినందించారు.