జన్నారం మండల కేంద్రంలో కార్మిక, అమాలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ప్రధానిగా దేశానికి వాజ్‌పేయి అందించిన సేవల గురించి పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గోలి చందు, హమాలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.