అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని జన్నారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడం వల్ల వర్షానికి ధాన్యం తడిచిపోయిందన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేదంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.