ఖానాపూర్ పట్టణానికి చెందిన బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధించిన ఖానాపూర్ కు చెందిన గోల్కొండ వినీత్ ను సోమవారం అరెస్టు చేశామని ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. జడ్జి జితిన్ కుమార్ ఆదేశాల మేరకు రిమాండుకు తరలించినట్టు ఎస్ఐ వెల్లడించారు.