విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే

75చూసినవారు
విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే
ఉట్నూర్ మండల కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర ఆలయంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలను స్వర్ణకార, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీర బ్రహ్మేంద్ర స్వామితో పాటు విశ్వకర్మ భగవానునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో కమ్యూనిటీ హల్ ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్