జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆ గ్రామంలో మున్నూరు కాపు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా సీపతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, సురేష్, కోశాధికారిగా లింగమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడిశెట్టి సుధాకర్, ప్రచార కార్యదర్శిగా నీరటి రాజేందర్, కార్యదర్శి పురం శెట్టి బాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.