ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల కోసం వేలాది హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వృద్ధులకు ఒక్క ఆశ్రమం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అవసాన దశలో కష్టాలు పడే వృద్ధుల కోసం ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని చంద్రయ్య కోరారు.