వంద క్యూసెక్కుల నీటి విడుదల

75చూసినవారు
వంద క్యూసెక్కుల నీటి విడుదల
కడెం ప్రాజెక్టు నుండి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, బుధవారం ప్రాజెక్టులో 675 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వివిధ నీటి అవసరాల నిమిత్తం వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని వారు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి ప్రాజెక్టులో 681 అడుగుల నీటిమట్టం ఉండేదని అన్నారు. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదు.

సంబంధిత పోస్ట్