మంచి సేవలతో ఉపాధ్యాయులకు గుర్తింపు

51చూసినవారు
మంచి సేవలతో ఉపాధ్యాయులకు గుర్తింపు
మంచి సేవలతో ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుందని జన్నారం మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ అన్నారు. జన్నారం మండలంలోని ధర్మారం యుపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న తుంగూరి గోపాల్, రామ్ టెంకి శ్రీనివాస్ అనే ఉపాధ్యాయులు సాధారణ బదిలీలలో భాగంగా ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. దీంతో వారిని శుక్రవారం సాయంత్రం ధర్మారం యుపిఎస్ పాఠశాలలో ఎంఈఓతో పాటు పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్